భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 01) తిరుపతి నగరంలోని రుయా ఆస్పత్రిలో ఎముకలు, కీళ్ల విభాగంలోని రోగులకు తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి పండ్లు పంపిణీ చేశారు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రుయాలో రోగులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వారు పండ్ల పంపిణీకి పెట్రోలియం కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ మెంబర్ కూడా అయిన తిరుపతి ఎంపీని ఆహ్వానించారు. ఇండియన్ ఆయిల్ కేర్స్ కార్యక్రమం కింద రోగులకు పండ్ల పంపిణీని చేపట్టారు.
ఈ సందర్భంగా రోగులతో ఎంపీ మాట్లాడుతూ సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకుంటారని రోగులకు ఎంపీ ధైర్యం చెప్పారు. రోగులను త్వరగా కోలుకునేలా చేసేందుకు వైద్యులు, ఇతర సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ చూపాలని గురుమూర్తి కోరారు. రోగులకు పండ్ల పంపిణీ సేవా కార్యక్రమాన్ని చేపట్టిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌ను ఎంపీ ప్రశంసించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో పాటు మిగిలిన ప్రభుత్వ రంగ చమురు సంస్థల వారికి ఎంపీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ ఆయిల్ డివిజనల్ మేనేజర్ రోహిత్ మోహన్, ఇండియన్ ఆయిల్ సిబ్బంది, రూయా హాస్పిటల్ వైద్యాధికారులు పాల్గొన్నారు.
Leave a Reply