భీమ్ న్యూస్ ప్రతినిధి నగరి (జనవరి 04) చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గo నగిరి కి సమీపంలోని తడుకుపేట దళితులు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు, గ్రామ సచివాలయంలోకి రాకూడదు అనే నెపంతో దళితులపై అగ్రవర్ణాలు దాడి చేయడం జరిగిందని, దాడి చేయడమే కాకుండా బైకులను తగలబెట్టడాన్ని సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి ఎస్ నాగరాజు, దళిత హక్కుల పోరాట సమితి (డి హెచ్ పి ఎస్) జిల్లా అధ్యక్షులు వి దామోదరం, జిల్లా కార్యదర్శి టి సి మహేష్ లు ఒక సంయుక్త ప్రకటనలో తీవ్రంగా ఖండించారు
తడుకు పేటలో జరిగిన సంఘటనపై సీటింగ్ జడ్జితో విచారణ జరిపి నిజా నిజాలను నిర్ధారించాలని కోరారు . దాడికి పాల్పడి శాంతి భద్రతలకు విగాథం కల్పించిన నిందితులపై కఠిన చర్యలు తీసుకొవాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం ,పోలీస్ అధికారులు చర్యలు చేపట్టాలని శాంతి భద్రతలను కాపాడాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.
Leave a Reply