భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు నగరం (జనవరి 04) ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణ కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒన్ మ్యాన్ కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా నేడు నెల్లూరు కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణం నందు జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ కుల సంఘాల నాయకులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నెల్లూరు జిల్లాలోని అన్నీ కుల సంఘాలు వారి వారి అభిప్రాయాలను వినతి పత్రాల ద్వారా చైర్మన్ కి సమర్పించారు. భోజన విరామం అనంతరం భారత్ మహాసేన నాయకులు జువ్విగుంట బాబు తమ కమిటీ సభ్యులతో నెల్లూరులోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కి వెళ్లి జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ల సమక్షంలో ఏక సభ్య కమీషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ని మర్యాద పూర్వకంగా కలిసి తమ అభిప్రాయాలను తెలిపే వినతి పత్రం అందజేశారు.
Leave a Reply