భీమ్ న్యూస్ ప్రతినిధి టెక్కలి (జనవరి 04) శ్రీకాకుళం జిల్లా విజిలెన్స్ మోనిటరింగ్ కమిటీ ఎస్సీ, ఎస్టీ సెల్ తరఫున సభ్యులుగా గేదెల రమణమూర్తి ఏకలవ్య ను రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. తన నియామకం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన వారందరినీ మర్యాద పూర్వకంగా కలిసి ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చం నాయుడుకి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకి, జిల్లా చైర్మన్ కి, జిల్లా కలెక్టర్ కి, డి.డి. సోషల్ వెల్ఫేర్ కి, కూటమి ప్రభుత్వం పెద్దలకు గేదెల రమణమూర్తి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
Leave a Reply