భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు(జనవరి 03) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం జిల్లా పరిషత్ పాఠశాల నెలుబల్లిలో శుక్రవారం జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా ప్రధానోపాధ్యాయులు డి కవిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గణితోపాధ్యాయులు జీలుగ శ్రీరాములు తల్లి జీలుగ సుభద్రమ్మ జ్ఞాపకార్థంగా విద్యార్థులకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీనివాస రామానుజన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జాతీయ గణిత దినోత్సవం జరుగుతుందని ఈ సందర్భంగా తెలిపారు. విద్యార్థులను మంచి విద్యార్థులుగా తీర్చిదిద్దడం కోసం తమ వంతు ప్రయత్నంగా సహాయ సహకారాలు అందించాలనే లక్ష్యంతో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ జాతీయ గణిత దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. పాఠశాలలో 182 మంది విద్యార్థులకునోటు పుస్తకాలు, స్కేళ్ళు, ప్యాడ్లు, పెన్నులు, పూరి బాక్సులు తదితర బహుమతులు అందించారు. తనతల్లి జ్ఞాపకార్థం పేదవారికి సహాయం చేయమని, విద్యార్థులకు సదుపాయాలను కల్పించాలని తల్లి పిలుపుమేరకు బహుమతులు అంద చేయడం జరిగిందని తెలిపారు. గణితం నందు మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులుగా మొదటి బహుమతి రూ1000 /-, రెండవ బహుమతి రూ 500/- వంతున 10 మందికి పంపిణీ చేశారు. తొమ్మిదవ,పదవ తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా మండల స్థాయిలో ఆటల పోటీల్లో పాల్గొనే విద్యార్థులకు స్పోర్ట్స్ సంబంధిత దుస్తులను అందజేశారు. విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం లో చికెన్ కర్రీ ప్రత్యేకంగా కూడా అందించారు.
గత పదేళ్లుగా ప్రతి సంవత్సరం తన తల్లి కోరిక మేరకు 50 వేల రూపాయల విలువగల వస్తువులను, ఆహారాన్ని విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు శ్రీరాములు అందించడం జరిగిందని, పేరు ప్రతిష్టల కోసం ఈ కార్యక్రమాలు చేయడం లేదని, పేద విద్యార్థులను చదువులో రాణించడం కోసం మరింత ప్రోత్సహించడమే లక్ష్యంగా చేసుకుని మాత్రమే కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. గణిత ఉపాధ్యాయుల సేవ విద్యార్థులకు పాఠశాలకు వెలకట్టలేనిదని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు.
మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయినిలకు ఘన సన్మానం :
చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జన్మదినం సందర్భంగా ఉపాధ్యాయినిలను, పాఠశాల సిబ్బందిని ఈ సందర్భంగా ఘనంగా సన్మానించి బహుమతులు, కానుకలు అందజేశారు. గత పదేళ్లుగా పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల అభ్యున్నతికి గణితోపాధ్యాయులు చేస్తున్న కృషి, మండల స్థాయిలోనూ జిల్లా స్థాయిలోను మరువలేనిదని విద్యార్థుల తల్లిదండ్రులు పలు ఉపాధ్యాయులు కొనియాడుతున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు గణిత ఉపాధ్యాయులు శ్రీరాములుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఆదిలక్ష్మి, మణి, సరళ, ధనలక్ష్మి, మల్లికార్జున్, ఖాదర్ బాషా, వెంకటరమణ, శ్రీరాములు, సురేష్ మధ్యాహ్న భోజన నిర్వాహకులు, సుజాత బత్తెమ్మ ఆయా రాజేశ్వరమ్మ, వాచ్మెన్ మురళి, సి ఆర్ పి మదన్ మోహన్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply