భీమ్ న్యూస్ ప్రతినిధి దొరవారిసత్రం (జనవరి 05) తిరుపతి జిల్లా దొరవారిసత్రం మండలంలోని బీసీ రెసిడెన్షియల్ పాఠశాలలో సూళ్ళురుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ఆదివారం జోనల్ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్రీడా పోటీల్లో పాల్గొనే విద్యార్థులు క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లలకు చదువులే కాకుండా ఆటల్లో కూడా ప్రోత్సహించే విధంగా ఉండాలని తెలిపారు. అదేవిధంగా ఎన్డీఏ కూటమి క్రీడలకు అధిక ప్రాధాన్యమిస్తుందని అందులో భాగంగానే “ఖేలో ఇండియా “నందు గ్రామస్థాయి క్రీడాకారులను, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలకు పంపే విధంగా కృషి ఉత్తేజం చేస్తున్నారని తెలిపారు. దీనికి కృషి చేస్తున్న ప్రధాని నరేంద్ర మోడీకి,ముఖ్య మంత్రివర్యులు నారా చంద్ర బాబు నాయుడుకి, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఆటల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దొరవారిసత్రం మండల తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు వేమసాని శ్రీనివాసులు నాయుడు,ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి, ఇట్టగుంట రత్నయ్య, షబ్బీర్ అలీ, రాయపాటి రాజేంద్రప్రసాద్, బందిల ఉదయ్, మారంరెడ్డి గోపాల్ రెడ్డి, నాగేంద్ర నాయుడు, విజయ్, ఆదిముని, వెంకటేశ్వర్ రెడ్డి, చంద్రయ్య, రవి నాయుడు, బాలాజీ, శేఖర్, సుధాకర్, వెంకట్, మల్లేపల్లి సుబ్రహ్మణ్యం, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply