భీమ్ న్యూస్ ప్రతినిధి వాకాడు (జనవరి 05) తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలో స్వర్ణసాగరం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం ముందస్తు సంక్రాంతి సంబరాలలో భాగంగా మండల కేంద్రంలోని ఎన్ జే ఆర్ కాలనీలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో కాలనీ వాసులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వీరిలో మొదటి బహుమతిగా యనమల రమణమ్మ రైస్ కుక్కర్, బందిలి సుందరమ్మ ఇడ్లీ కుక్కర్, మూడవ బహుమతిగా చిత్ర హేమలత నాన్ స్టిక్ దోశ ప్యానల్ గెలుపొందిగా, పోటీలలో పాల్గొన్న మరో 38 మంది మహిళలకు ఫౌండేషన్ చైర్మన్ దామా విజయ్ కుమార్ టిడిపి మండల అధ్యక్షుడు దువ్వూరు మధుసూదన్ రెడ్డి, తూపిలి సాగునీటి సంఘం అధ్యక్షుడు తిరుమూరు శ్రీనివాసులు రెడ్డి చేతుల మీదుగా కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.జె.ఆర్. కాలనీ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
Leave a Reply