భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 09) తిరుపతిలో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.ఈ సంఘటన నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు గతంలో ఇచ్చిన ప్రవచనం వైరల్గా మారింది. ఆయన చెప్పిన సూత్రాలు ప్రస్తుతం భక్తుల మధ్య చర్చకు దారి తీసాయి. గరికపాటి వ్యాఖ్యల ప్రకారం భగవంతుడి దర్శనానికి ప్రత్యేక రోజులు లేదా ముహూర్తాలు అవసరం లేదని స్పష్టం చేశారు.
గరికపాటి చెప్పినట్లుగా, ముక్కోటి ఏకాదశి రోజునే దర్శనం కోసం పోటెత్తడం అనవసరమని, భక్తులు అదే రోజు రావాలని ఆత్రంగా ఎగబడితే ప్రమాదాలే జరుగుతాయని హెచ్చరించారు. భక్తులు రెండు మూడు రోజులు ఆగి వెళ్లినా పుణ్యం కరిగిపోదని ఆయన పేర్కొన్నారు. దర్శనం ఆలస్యమైనా భగవంతుడు శపించడని, భక్తుల ఆత్మీయ శ్రద్ధ ముఖ్యమని గరికపాటి స్పష్టం చేశారు. భక్తుల భద్రత, ధార్మిక చింతన రెండూ సమ సమాజంగా ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
Leave a Reply