భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (జనవరి 09) తిరుపతి పట్టణంలోని వైకుంఠ ఏకాదశి టిక్కెట్లు జారీ చేసే కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో 6 మంది భక్తులు మృతి చెందిన ఘటన పై న్యాయ విచారణ చేపట్టాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ మాజీ చైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి డిమాండ్ చేశారు. మండలంలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకన్లు జారీ చేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మృతి చెందడం పై వారు తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశామని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేశారు. గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
వైకుంఠ ఏకాదశి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇలా ప్రాణాలు కోల్పోవడం అత్యంత విచారకరమని, ఈ ఘటనకు టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగమే పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు పోటీపడి వస్తారని అంచనా వున్నా, దానికి తగినట్లుగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే ఈ విషాదకర ఘటన జరిగిందన్నారు.దీనికి బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలు కోటి రూపాయలు చొప్పున ఆసుపత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స, ఆర్థిక సహాయం ప్రకటించాలన్నారు. మొత్తం ఘటనపై న్యాయ విచారణకు ఆదేశించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ నన్నం ప్రిస్కిల్లా, చిల్లకూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ హరిబాబు, వైసీపీ నాయకులు కరుణం రఘు నాయుడు, ఎల్లు మోహన్, గంజి దయాకృష్ణా తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply