భీమ్ న్యూస్ ప్రతినిధి చంద్రగిరి – చిన్నగొట్టిగల్లు (జనవరి 11) తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట వద్ద రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్న ఘటన శనివారం చోటు చేసుకుంది. తిరుపతి నుంచి మదనపల్లె, పీలేరు వెళ్లే ఆర్టీసీ బస్సులు భాకరాపేట సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద నెమ్మదిగా, స్లో అవ్వడంతో డీకొన్నట్లు స్థానికులు తెలిపారు. అద్దాలు పగలగా ప్రయాణికులకు ఎలాంటి గాయాలు లేకుండా ప్రయాణికులుకు తృటిలో ప్రమాదం తప్పిందని చెప్పారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Leave a Reply