భీమ్ న్యూస్ ప్రతినిధి చంద్రగిరి (జనవరి 13) ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదివారం తిరుపతి జిల్లా పర్యటన ముగించుకుని తన సొంత గ్రామ అయిన నారావారిపల్లెకు చేరుకున్నారు. అనంతరం సంక్రాంతి పండుగలో భాగంగా సోమవారం ఉదయం నిర్వహించిన భోగి వేడుక ల్లో సీఎం చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. స్థానికులతో ఆప్యాయంగా మాట్లాడుతూ.. భోగి జరిపిన సీఎం.. పలువురి నుంచి వివిధ సమస్యలపై వినతి పత్రం తీసుకున్నారు.
అనంతరం సీఎం సతీమణి నారా భువనేశ్వరి మహిళలకు ముగ్గుల పోటీలు, పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించగా.. వాటిని సీఎం తిలకించారు. ఈ పోటీల్లో గెలుపొందిన మహిళలకు, పిల్లలకు బహుమతులు సీఎం దంపతులు ప్రదానం చేశారు. ఈ భోగి వేడుకల్లో సీఎం దంపతులతో పాటు కొడుకు, మంత్రి నారా లోకేష్, నారా బ్రాహ్మణి, నందమూరి రామకృష్ణ, నందమూరి వసుంధర, దేవాన్ష్ లు పాల్గొన్నారు. సీఎం రాకతో నారావారిపల్లె ప్రత్యేక శోభను సంతరించుకుంది. ఈ పండుగ కార్యక్రమాల అనంతరం సీఎం చంద్రబాబు నాయుడు పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Leave a Reply