భీమ్ న్యూస్ ప్రతినిధి చంద్రగిరి (జనవరి 13) సంక్రాంతి పర్వదినం వేళ తిరుపతి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు బస్సులు ఒకదానికొకటి ఢీ కొన్న ఘటనలో 30 మందికి తీవ్ర గాయాలయ్యాయి.చంద్రగిరి మండలం కళ్యాణి డ్యామ్ దగ్గర ఏపీఎస్ఆర్టీసీకి చెందిన రెండు అదుపు తప్పి ఢీ కొట్టాయి. ఈ ప్రమాదంలో దాదాపు 30 మంది పైగా ప్రయాణికులు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రమాదంలో ఎవరూ చనిపోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ప్రమాదం జరిగిన చోట రోడ్డుకు అడ్డంగా నిలిచిపోవడంతో రెండు కిలోమీటర్ల భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న బస్సులను తొలగించి, ట్రాఫిక్ ను క్లియర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు చేపడతామని స్థానిక సీఐ తెలిపారు.
Leave a Reply