భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (జనవరి 13) తిరుపతి జిల్లా నాయుడుపేటలో జనవరి 12 స్వామి వివేకానంద జయంతి, జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని, తిరుపతి జిల్లా నాయుడుపేటలో, కౌన్సిల్ ఫర్ సిటిజన్ రైట్స్ (సిసిఆర్) రాష్ట్ర కమిటీ మెంబర్ తులసీదాస్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంకు సిసిఆర్ రాష్ట్ర కార్యదర్శి వరదయ్యపాలెం కు చెందిన గుత్తి త్యాగరాజు హాజరయ్యారు. స్వామి వివేకానంద సేవలను, ఆయన తెలియజేసిన సూక్తులను స్మరించుకున్నారు. సిసిఆర్ గ్రామస్థాయిలో బలోపేతం కావడం కోసం కృషి చేయాలని పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా పి వెంకటేశ్వర్లు, ఎం అశోక్ లకు సిసిఆర్ ఐడి కార్డులు అందజేయడం జరిగింది. సిసిఆర్ నియమ నిబంధనలకు, అనుగుణంగా పనిచేస్తూ, అవినీతి లేని భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నూతన సభ్యులకు తెలియజేయడం జరిగింది. ప్రజా ప్రయోజనార్థం తమ వంతు సేవలు అందించేందుకు సిసిఆర్ సభ్యులు ముందు వరుసలో ఉండాలని రాష్ట్ర కమిటీ సభ్యులు సూచించారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల ఇంచార్జ్ ఇలుపూరి పెంచలయ్య, కోట మండల ఇంచార్జ్ పులి సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply