భీమ్ న్యూస్ ప్రతినిధి నాయుడుపేట (జనవరి 16) తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని ఏ ఎల్ సీఎం క్రీడా మైదానంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఎద్దుల పోటీల్లో అపశృతి చోటు చేసుకుంది. పోటీల నిర్వహణలో కనీస భద్రతా చర్యలు చేపట్టకపోవడం వల్ల ప్రమాదం పోటీలను వీక్షీంచేందుకు విచ్చేసిన ప్రజలు, వాహనాలపైకి దూసుకెళ్లిన ఎద్దుల ప్రమాదంలో మేనకూరుకు చెందిన పెరంశెట్టి పోలయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. పలు వాహనాలు, కారు ద్వంసమైయ్యాయి. ఎమ్మెల్యే విజయశ్రీ, నాయకులు, పోలీసులు ఆసుపత్రి వద్దకు చేరుకుని పరిశీలించారు. తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.
Leave a Reply