భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 17) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం కొమరిక గ్రామంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ అధికారులు, నెల్లూరు అత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ నారాయణ అధ్యక్షతన నిర్వహించారు. కొమరిక గ్రామ రైతుల పొలాలలో మాని పండు తెగులు, ఎలుకలను గమనించారు. ఈ సందర్భంగా ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ శివ నారాయణ మాట్లాడుతూ, నారుమడిలో వివిధ రకాల కలుపు మొక్కలు, వాటి నివారణ చర్యలు గురించి, ఎరువులు మరియు నీటి యాజమాన్య పద్ధతుల గురించి వివరించారు. ఏ.డీ.ఏ. ఏ.రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఎలుకల నివారణ కోసం వ్యవసాయ శాఖ సిబ్బంది బ్రోమోడైలిన్ మందును రైతులకు ఇస్తామని, ఈ మందుని సామూహికంగా అందరు రైతులు ఒకేసారి వారి పొలాల్లో ఉపయోగించుకోవాలని తెలిపారు. ఒక కేజీ నూకలకు, 20 గ్రాముల మందు, 20 గ్రాముల నూనె కలుపుకొని, చిన్న చిన్న పొట్లాలు గా చేసుకొని, ఎలుకల బోరియలు దగ్గర ఉంచుకోవాలని తెలియజేశారు.
అనంతరం మండల వ్యవసాయ అధికారి డి. రఘునాథరెడ్డి మాట్లాడుతూ, యూరియా ని అధికంగా వాడటం, వెన్ను తీసి పాలు పోసే సమయంలో చిరుజల్లులు తేమతో కూడిన వాతావరణం మానీ పండు తెగులు కి కారణమని తెలిపారు. వెన్ను తీసి పాలు పోసే గంటలో విత్తనం నుంచి పసుపు పచ్చని గుండ్రంగా బయటకు వస్తుంది. నివారణా చర్యలుగా యూరియాని సిఫారసు చేసిన మోతాదులో వాడాలి. ఫ్రోఫీకోనజోల్ (టిల్డ్ ) 200 m.l. మందు ను, 200 లీటర్ల నీటిలో కలిపి ఒక ఎకరాకి పిచికారి చేయాలి. ఒక లీటర్ టీల్ట్ మందు 5 ఎకరాలకు సరిపోతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వి.ఏ.ఏ. లు శ్రీకాంత్, సుదీక్షణ పాల్గొన్నారు.
Leave a Reply