భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (జనవరి 16) తిరుపతి జిల్లా నాయుడుపేటలోని స్వర్ణముఖి నదిలో ఏటి పండుగ కార్యక్రమంలో పాల్గొనేందుకు గురువారం నాయుడుపేటకు విచ్చేసిన రాష్ట్ర రవాణా యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డికి ఎమ్మెల్యే విజయశ్రీ, మాజీ ఎమ్మెల్యే పరసారత్నం, టీడీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ఆహ్వానం మేరకు ఆమె నివాసానికి వెళ్లారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ఎమ్మెల్యే మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు మండల టీడీపీ అధ్యక్షులు సంచి కృష్ణయ్య, వివిధ మండలాల టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply