భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 18) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట పంచాయతీ పాగా వారి పాలెం డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నెల్లూరు జిల్లా పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి విచ్చేశారు. తొలుత డా. బి.ఆర్. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రజలందరూ జోహార్ అంబేడ్కర్ అని నినాదాలు చేశారు. కార్యక్రమంలో భాగంగా మహాత్మా గాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి, రోడ్డుపై చెత్తను ఊడ్చారు. స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ డ్రాయింగ్ బొమ్మ వద్ద జరిగిన మానవ హారంలో భాగస్వామ్యం అయ్యారు. అనంతరం అక్కడి నుండి డేవిస్ పేట ఎస్టీ కాలనీ వరకూ స్వచ్ఛ ర్యాలీలో ప్రజలతో కలిసి పాదయాత్ర చేశారు. నేడు స్వర్గీయ నందమూరి తారకరామారావు వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన పేద ప్రజలకు దోమ తెరల పంపిణీ కార్యక్రమంలో ఎస్టీలకు దోమ తెరలను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్ రావెళ్ళ వీరేంద్రనాయుడు, టీడీపీ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, మండల తహశీల్దార్ టి.వి. కృష్ణ ప్రసాద్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్ర బాబు, మండల పోలీస్ స్టేషన్ ఎస్సై నాగార్జున రెడ్డి, పోలీస్ సిబ్బంది, డేవిస్ పేట పంచాయతీ టీడీపీ నాయకులు తన్నీరు మధుబాబు, కార్యకర్తలు వెంకటేశ్వర్లు, చిన్నబాబు, రవీంద్ర, పంచాయతీ కార్యదర్శి టి. శైలజ, గ్రామ రెవిన్యూ అధికారి సంధ్య, సచివాలయం సిబ్బంది, జగదేవిపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు, మెడికల్ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానిక మండలం ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో పాటు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు.
Leave a Reply