భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (జనవరి 19) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో శనివారం ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ,గూడూరు ఎమ్మెల్యే డాక్టర్ పాసిం సునీల్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త కొండేపాటి గంగా ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలను యువ సెక్యూరిటీ సర్వీసెస్ డైరెక్టర్ డాక్టర్ రౌతు యువరాజ్ మర్యాదపూర్వకంగా కలిశారు. గతఐదేళ్ల తర్వాత అత్యంత వైభవంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్లెమింగో ఫెస్టివల్ నిర్వహిస్తున్న ఎమ్మెల్యేలకు యువరాజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధికారులు, ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Leave a Reply