భీమ్ న్యూస్ ప్రతినిధి గంగాధర నెల్లూరు (జనవరి 20) చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజవర్గం సోమవారం గంగాధర నెల్లూరు ఎంపీడీవో కార్యాలయం లో నియోజకవర్గం ఎమ్మెల్యే డాక్టర్ థామస్, చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ మిశ్రా చేతుల మీదుగా వంశ రాజు కులస్తులకు ఇంటి పట్టాలు అందించడం జరిగింది. పూరిగుడిసెలో నివసిస్తున్న ప్రజలకు ప్రభుత్వ పట్టాలు అందించడం జరిగింది. అలాగే నియోజకవర్గంలో సిసి రోడ్లు ఏర్పాటు గురించి కలెక్టర్ కి ఎమ్మెల్యే తెలిపరిచారని వెంటనే అభివృద్ధి పథంలో నడిచేందుకు నిధులు విడుదల చేయాలని సభాముఖంగా తెలియజేయడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మండల అధ్యక్షులు స్వామిదాస్ వి కె నాయుడు , జనసేన పార్టీ యుగంధర్ , ఎంపీడీవో హరి ప్రసాద్, శ్రీధర్, దేవ సుందరం, నాయి బ్రాహ్మణ అధ్యక్షులు ఏం. హరి ప్రసాద్ మండల టిడిపి కార్యకర్తలు పాల్గొని పేద ప్రజలకి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందని తెలిపారు.
Leave a Reply