భీమ్ న్యూస్ ప్రతినిధి కోవూరు (జనవరి 24) నెల్లూరు జిల్లా కోవూరు పట్టణంలో 25వ తేదీన శనివారం 33/11KV కోవూరు తాలూకా ఆఫీస్ సబ్ స్టేషన్లో మరమ్మత్తుల నిమిత్తం కోవూరు పట్టణ పరిధిలో అన్ని ప్రాంతాలలో ఉదయం గం. 09.00 నుండి గం. 11.30 ని. వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందని కోవూరు సబ్ డివిజన్ ఆపరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ కే. మధుసూధనరెడ్డి పత్రికా ప్రకటన విడుదల చేశారు. విద్యుత్తు వినియోగదారులు ఈ అంతరాయానికి సహకరించాలని, అత్యవసర విభాగానికి సంబంధించిన వారు ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
Leave a Reply