భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (జనవరి 23) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణం నందు గురువారం మండల టిడిపి అధ్యక్షుడు సంచి కృష్ణయ్య ఆధ్వర్యంలో నారా లోకేష్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ నెలవల సుబ్రహ్మణ్యం మాట్లాడుచూ మన ప్రియతమ విద్యాశాఖ మంత్రి అయిన నారా లోకేష్ జన్మదిన వేడుకలను మనమందరం కలిసి ఎలా జరుపుకొనుట చాలా ఆనందంగా ఉందని విద్య విషయంలో యువతకు దిశా-నిర్దేశాలు సూచించుటలో ఆయకు ఎవ్వరు సాటి లేదన్నారు. తన పాదయాత్రలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ప్రజా సమస్యలు తెలుసుకుంటూ వారికి భవిష్యత్ భరోసా ఇచ్చిన యువ నాయకుడని, ఆయన పాదయాత్ర ఫలితం మీ అందరి సహకారం తెలుగుదేశం అధికారానికి దోహదం చేసిందని ఇదే ఐకమత్యంతో అభివృద్ధి దిశలో ముందుకెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, రొట్టెలు పంచిపెట్టారు. ప్రజానీకానికి అన్నదాన కార్యక్రమానికి సహరించిన పేరం రమేష్ నాయుడుకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మురళి రెడ్డి, టిడిపి మండల కార్యదర్శి నాగేందర్ రెడ్డి, ప్రెసిడెంట్ సంఘ అధ్యక్షుడు శివకుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు వాసు , ప్రసాద్ నాయుడు, రాజారెడ్డి, మధు నాయుడు, చైతన్య కృష్ణారెడ్డి, సిద్ధిలయ్య, డాక్టర్ అంకయ్య , రాపూరు పరుశురాం, కలవకూరు సర్పంచ్ సురేష్ తదితర నాయకులు, కార్యకర్తలు, పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Leave a Reply