భీమ్ న్యూస్ ప్రతినిధి విశాఖపట్నం (జనవరి 24) ఏపీలో రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ కు, తనను ఇంతటి ఉన్నతస్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకి సదా కృతజ్ఞుడిని అని తెలిపారు. జగన్ కు మంచి జరగాలని కోరుకుంటున్నానని పేర్కొన్నారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా, పార్టీ జాతీయ కార్యదర్శిగా, పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తి వంచన లేకుండా కృషి చేశానని అన్నారు. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పని చేశానని తెలిపారు.
దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో తనకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీకి, హోంమంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నా భవిష్యత్తు వ్యవసాయం.. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను’ అని విజయసాయి రెడ్డి తెలిపారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు. ఇది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని, ఏ పార్టీలోనూ చేరడం లేదని విజయసాయి రెడ్డి ఎక్స్ లో తెలిపారు. చంద్రబాబు కుటుంబంతో వ్యక్తిగత విభేదాలు లేవు.. పవన్ కల్యాణ్‌తో చిరకాల స్నేహం ఉందని విజయసాయిరెడ్డి ఎక్స్ లో పేర్కొన్నారు.
Leave a Reply