భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 25) ఉచిత పశు ఆరోగ్య శిబిరాల్లో భాగంగా 25 తేదీన ఇందుకూరుపేట మండలంలోని జంగంవాని దొరువు గ్రామంలో పశు ఆరోగ్య శిబిరం నిర్వహించారు. ఇందుకూరుపేట ప్రాంతీయ పశు వైద్య శాల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ బి. మురళీకృష్ణ హాజరై రైతులకు పాడి పశువుల యాజమాన్యం బహు వార్షిక పశు గ్రాసాల పెంపకంపై రైతులకు అవగాహన కల్పించారు. మినీ గోకులాలు, పశువులకు నట్టల నివారణ మందులు, 18 లేగదూడలకు, 52 పెద్ద పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పెయ్యదూడల లింగ నిర్ధారణ వీర్యము, కిసాన్ క్రెడిట్ కార్డులు మొదలగు వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్య సిబ్బంది LSA శానంపూడి రవి, AHA లు ఇండ్ల రమేష్, మేనాటి మౌనిక, సర్పంచ్ సుదీరమ్మ, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Leave a Reply