భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (జనవరి 24)
తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం చింతపూడి గ్రామంలో నారా లోకేష్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టిడిపి నాయకులు గ్రామంలో కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగుదేశం పార్టీ గ్రామ నాయకులు, సూళ్లూరుపేట నియోజకవర్గ ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు రాపూరు పరశురాం ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో మహిళలకు చీరలు, వృద్ధులకు దుప్పట్లు పండ్లు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు సంచి కృష్ణయ్య, దామెర ప్రసాద్ నాయుడు, మురళి నాయుడు, సిద్దులయ్య నాయుడు, మదనన్న, గురవయ్య, చంద్ర, గ్రామ టిడిపి నాయకులు, కార్యకర్తలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply