భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాకుళం (జనవరి 26) బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన సిరిపురం తేజేశ్వరరావు శనివారం పలువురు జిల్లా ఉన్నతాధికారులను మర్యాద పూర్వకంగా కలిశారు. శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఐపీఎస్ ను జిల్లా పోలీస్ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అన్ని విధాల సహకరించాలని కోరారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా. తెన్నేటి వి బాల మురళి కృష్ణ ని, జిల్లా వైద్య విధాన పరిషత్ ఆసుపత్రి ల హెడ్ డీసీహెచ్ఎస్ డా. నూర్తి కళ్యాణ్ బాబుని కలిశారు. వారంతా సిరిపురం తేజేశ్వరరావును అభినందించారు.
Leave a Reply