భీమ్ న్యూస్ ప్రతినిధి కోటబొమ్మాలి (జనవరి 26) ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా అధికారులు పనిచేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజక వర్గం కోట బొమ్మాళి టీడీపీ పార్టీ కార్యాలయంలో శనివారం ప్రజా దర్భార్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతా లనుంచి ప్రజలు తమ వినతులను అందజేశారు. వచ్చిన వినత పత్రాలను స్వయంగా పరిశీలించి గ్రీవెన్స్ కు హాజరైన రెవెన్యూ, ఇరిగేషన్, రహదారులు, పంచాయితీ, విద్యుత్ శాఖ అధికారాలకు అక్కడికక్కడే ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం కృషిచేస్తుందని తెలిపారు. రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.
Leave a Reply