భీమ్ న్యూస్ ప్రతినిధి ఒంటిమిట్ట (జనవరి 31) కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం ఒంటిమిట్ట మండలం కోటపాడు గ్రామం, సోమశిల బ్యాక్ వాటర్ సహాయంతో పాటు ఆక్వా అభివృద్ధి కూటమి ప్రభుత్వం బాటలు వేసింది. సోమశిల బ్యాక్ వాటర్ కోటపాడు రెండు లక్షల చేప పిల్లలను వదలడం జరిగింది. ఈ రోజు ఉదయం 9 గంటలకు ఒంటిమిట్ట మండలంలోని కోటపాడు గ్రామం స్టాకింగ్ పాయింట్ నందు సోమశిల బ్యాక్ వాటర్ దగ్గర చెరువులో మత్స్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో ప్రధానమంత్రి మత్స్య సంప్రదాయోజన పథకం క్రింద సీడ్ స్టార్టింగ్ చేప పిల్లలు వదలడం జరిగింది.
రాష్ట్రంలో వ్యవసాయంతో పాటు ఆక్వా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి తెలియజేశారు. రెండు లక్షల చేప పిల్లలను అధికారులు మరియు ఒంటిమిట్ట మండలం తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కలిసి వదలడం జరిగింది. ఈ సందర్భంగా ఒంటిమిట్ట సీనియర్ నాయకులు ఎస్వి రమణ మాట్లాడుతూ సోమశిల బ్యాక్ వాటర్ లో నీళ్లు కలకలాడుతున్నాయంటే తెలియజేశారు. అలాగే సోమశిల బ్యాక్ వాటర్ లో చేప పిల్లలను వదిలి అటు వ్యవసాయ రంగంతోపాటు ఇటు ఆక్వా రంగాన్ని కూడా అభివృద్ధి దిశగా నడిపించేందుకు చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఆయన తెలియజేశారు. భవిష్యత్తులో ప్రతి రంగాన్ని అభివృద్ధి దిశగా నడిపించి పారిశ్రామిక అభివృద్ధితో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోని మొదటి స్థానంలో నిలిపేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్ధితో పనిచేస్తున్నారని, ఆయన అడుగుజాడల్లో తాము కూడా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ముందుకు సాగుతామని ఆయన తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట మండల తహసీల్దార్ వెంకట రమణమ్మ, మత్స్యశాఖ అధికారులు FDO కిరణ్ కుమార్, ప్రసన్న క్రాంతి, ఆర్ ఐ భాస్కర్ రెడ్డి, రీ సర్వే డిటి స్వరూప, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజ్జల నరసింహారెడ్డి, తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిలి రాయుడు, మండల సీనియర్ నాయకులు కాంట్రాక్టర్ ఎస్వీ రమణ, మీనిగ వెంకటరమణ, నామాల వెంకటయ్య, సాదు శ్రీనివాసులు, మౌలాలి, ఆలూరు వెంకట సుబ్బయ్య, ఎంపీ కృష్ణయ్య, వినోద్ రెడ్డి, మత్స్యశాఖ సొసైటీ నాయకులు రమణ, చెన్నయ్య, కుడమలూరు గ్రామస్తులు వెంకటాయపల్లి రమణ, ఇబ్రహీంపేట కొండారెడ్డి, రమణ, చిన్న, పుల్లయ్య, పెంచలయ్య, శీను, నందానగర్ మల్లి, వెంకటయ్య, రోశయ్య, కనకరాజు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
Leave a Reply