భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (జనవరి 31) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని జగదేవిపేట గ్రామంలో ఇండి గ్యాప్ పొలం బడి కార్యక్రమాన్ని సబ్ డివిజన్ స్థాయిలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి డి. రఘునాథరెడ్డి మాట్లాడుతూ, గ్యాప్ పొలంబడి అనగా మేలైన యాజమాన్య పద్ధతులు పాటించి, శాస్త్రవేత్తల సూచనలు మేరకు, పురుగు మందులు ఎరువులు వాడుతూ అలాగే భూసార పరీక్ష ఫలితాల ఆధారంగా ఎరువులు వాడుతూ తక్కువ ఖర్చుతో నాణ్యమైన దిగుబడిని. సాధించుకునేలా పొలం బడిలోని రైతులకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. తద్వారా పొలంబడి రైతులు వారి గ్రామంలో మిగతా రైతులకు ఈ సమాచారం తెలిపి, వరి పంట దిగుబడిలో నాణ్యత ప్రమాణాలు పాటించి, అధిక దిగుబడి సాధించి, అధిక ఆదాయం పొందుతారని రైతులకు తెలియజేశారు. సహాయ వ్యవసాయ సంచాలకులు లక్ష్మీ మాధవి మాట్లాడుతూ, రైతులు పంటపై అధికంగా రసాయనిక ఎరువులు వాడటం తగ్గించి, పచ్చి రొట్టె ఎరువులు, పశువుల ఎరువులు వినియోగాన్ని పెంచాలని, అదేవిధంగా సేంద్రియ వ్యవసాయం ద్వారా అధిక ధరలకు వరి ధాన్యాన్ని మరియు ఇతర పంటలను విక్రయించుకోవచ్చని తెలియజేశారు.
DRC ఏ.వో. శ్రీనివాస చక్రవర్తి మాట్లాడుతూ పొలంబడి పొలంలో ఎలుకల నివారణకు బ్రోమోడైల్ ని ముందును రైతులు గట్లపైన ఎలా ఉంచుకోవాలో ఎలా తయారు చేసుకోవాలో రైతులకు తెలియజేశారు. రైతులు ఈ మందును సామూహికంగా పెట్టుకోవాలని సూచించారు. అనంతరం ఇందుకూరుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ. రాజ్ కుమార్ మాట్లాడుతూ, ఇందుకూరుపేట సబ్ డివిజన్ పరిధిలోని మూడు మండలాల్లో మూడు గ్యాప్ పొలం బడిని ఏర్పాటు చేశారు. ప్రతి పొలం బడిలో 30 మంది రైతులు, వారికి 14 వారాలు పాటు తరగతులు నిర్వహించడం జరుగుతుంది. మూడు మండలాల్లో 15 మంది ఇండి గ్యాప్ పొలం బడి రైతులను ఎంపిక చేశారు. ఈ 15 మందికి ఈ రోజు శిక్షణ ఇచ్చారు. ఈ 15 మంది రైతులకు జిల్లా స్థాయిలోని F.P.O ద్వారా, రాష్ట్రస్థాయిలో A.P.S.O.P.C.A ద్వారా ఇండి గ్యాప్ రిజిస్ట్రేషన్ చేశారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర ఒక క్వింటాకు 2320/- రూపాయలుగా ఉంది. ఇండి గ్యాప్ పొలం బడిలో చేరి, వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, అతి తక్కువ ఎరువులు పురుగులు, మందులతో పండించిన పంటకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అధిక ధరకు సుమారుగా ఒక క్వింటా కు 3000 /- రు అంతకు మించి వరి ధాన్యం విక్రయించ బడుతుందిని వ్యవసాయ సహాయకులు ఏ. రాజ్ కుమార్ తెలియజేశారు. రైతులతో కలిసి పొలంబడి రైతులు చేత, ఎలుకలు నివారణకు ఎలుకల ముందు కలిపిన పొట్లాలను, పొలం గట్లపైన ఉంచారు. ఈ కార్యక్రమంలో పొలం బడిలో చేరిన రైతులకు శిక్షణ ఇవ్వటానికి, నెల్లూరు డి.ఆర్సి నుంచి ఏ.డి.ఏ. లక్ష్మీ మాధవి, ఏ.వో. శ్రీనివాస చక్రవర్తి, ఇందుకూరుపేట సహాయ వ్యవసాయ సంచాలకులు ఏ. రాజ్ కుమార్, మూడు మండలాల వ్యవసాయ అధికారులు డి. రఘునాథ్ రెడ్డి, శిరీష, జోష్నారాణితో పాటు వెంకటేశ్వరరెడ్డి, బి. వెంకట రవికుమార్ నాయుడు, వ్యవసాయశాఖ సిబ్బంది, గ్రామ రైతులు పాల్గొన్నారు.
Leave a Reply