భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (జనవరి 31)
తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 4వ తేదీన జరిగే రథసప్తమి వేడుకలకు శుక్రవారం నుంచే ఏర్పాట్లు చేస్తున్నారు. రథసప్తమి నాడు స్వామి, అమ్మవార్లు విహరించే సప్త వాహనాలను వేద పండితుల పర్యవేక్షణలో శుద్ధి చేశారు. గర్భాలయంతో పాటు పరివార దేవతా మూర్తుల ఆలయాలు, వాహన మండపాల్లో శుద్ధి చేయబడ్డాయి. భక్తుల రద్దీకి తగినట్లుగా దర్శన ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు.
Leave a Reply