భీమ్ న్యూస్ ప్రతినిధి చౌటుప్పల్- జాతీయం (జనవరి 31) తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం రెడ్డిబావి గ్రామంలో నీళ్లు లేని బావిలో రాత్రి సమయంలో నక్క పడింది. నక్కను చూసేందుకు గ్రామంలోని ప్రజలు బావి దగ్గరకు వెళ్లి చూస్తున్నారు. గ్రామంలో ఎక్కడ అడవి లేకపోయినా నక్క ఎక్కడ నుండి వచ్చిందని స్థానికులు అనుకుంటున్నారు. ఈ మధ్య గ్రామాల్లో అడవి జంతువులు వస్తున్న సంఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. నక్కను బావిలో తీయడానికి గ్రామస్తులు తీవ్ర ప్రయత్నాలు చేపట్టారు.
Leave a Reply