భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (ఫిబ్రవరి 01) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని పలు గ్రామాలలో, చుట్టుపక్కల మండలాలలో గత కొన్ని సంవత్సరాలుగా వ్యవసాయ పంపు సెట్లు (మోటార్లు) ట్రాన్స్ఫార్మర్లు, స్టార్టర్లు పెద్ద మొత్తంలో దొంగతనాలు జరుపుతున్న సంఘటనలు పోలీసు వారికి సవాల్ గా మారింది. గత కొన్ని నెలలుగా ఓజిలి, పెళ్లకూరు, నాయుడుపేట, డివి సత్రం, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తి తదితర మండలాలలో ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి వాటిలో ఉన్న కాపర వైర్ ను కేజీల లెక్కన అమ్ముకుంటూ రైతుల్ని అష్ట కష్టాలు పెట్టడం తోపాటు,పోలీసు వారికి ఈ దొంగతనాలు ఛాలెంజ్ గా మారాయి. ఈ ఘటనలపై గత కొన్ని నెలలుగా నిఘా వేసిన పెళ్ళకూరు పోలీసు వారు అత్యంత చాకచక్యంగా ట్రాన్స్ఫార్మర్ దొంగలను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని ఎస్సై నాగరాజు తెలిపారు. ఈ సందర్భంగా సిఐ సంగమేశ్వర రావు మాట్లాడుచూ చుట్టుపక్కల గ్రామాలలోనే కాకుండా అనేక మండలాలలో గత కొన్ని నెలలుగా అనిల్, కిరణ్, రమణయ్య, పార్ధు, నిరంజన్, చిన్న తదితరులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగిందని, వారు సుమారు 26 ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి లక్షలువిలువచేసే కాపర్ వైర్ ను అమ్మినట్లు విచారణలో తేలిందని తెలిపారు. దొంగతనం చేసి పగలగొట్టిన వైరును శ్రీకాళహస్తికి చెందిన బాబు, సత్యవేడుకు చెందిన తిరుమల అనే ఇద్దరు దొంగ సొత్తుఅని తెలిసి, దొంగల వద్ద నుంచి కొనుగోలు చేస్తున్నారని తెలిపారు .వారి ఇరువురిని కూడా అదుపులో తీసుకున్నామని, వీరి దగ్గర నుండి రూ. 2,97,00 విలువగల 285 కేజీల కాపర్ వైర్ , నేరం చేయుటకు ఉపయోగించిన రెండు ఆటోలు, స్వాధీనపరుచుకున్నామని తెలిపారు. అంతే కాకుండా ఆరు మండలాల్లో 26 ట్రాన్స్ ఫార్మర్ లను దొంగలిస్తూ, ఒక్కొక్క స్టేషన్ లో వీరిపై రెండు కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు.వీరే కాకుండా శ్రీకాళహస్తికి చెందిన అజయ్, చెంబేడు గ్రామానికి చెందిన ఓంకార్, సామ్యూల్ అను ముగ్గురు పరారీలో ఉన్నారని, త్వరలో వీరిని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తామని అన్నారు. దొంగతనాలు పునరావతం కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సీఐ సంగమేశ్వరరావు మీడియా ముఖంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో పెళ్లకూరు, నాయుడుపేట పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
Leave a Reply