భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (ఫిబ్రవరి 06) తిరుమల శ్రీవారిని గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ వీఐపీ బ్రేక్ సమయంలో దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికి దర్శనం ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అధికారులు ఆలయంలో పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Leave a Reply