భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (ఫిబ్రవరి 06) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలో సమదాయ పాఠశాలల ( కాంప్లెక్స్/క్లస్టర్) పునర్వ్యవస్థీకరణలో భాగంగా మండల విద్యాశాఖ అధికారులు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో మండలంలో మొత్తం 6 సముదాయ పాఠశాలలు ఉండేవి. కొంతమంది సముదాయ పాఠశాలల ( కాంప్లెక్స్/క్లస్టర్) కోరిక మేరకు మండల విద్యాశాఖఅధికారులు అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుని కాంప్లెక్స్ పాఠశాలలను మండలంలో కేవలం 2 సముదాయ పాఠశాలలు ( కాంప్లెక్స్/క్లస్టర్) పాఠశాలలుగా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సదరు మండల విద్యాశాఖ అధికారులు కుంటి సాకులు చెబుతూ విద్యా వ్యవస్థ బలోపేతం చేయడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే ఈ విధంగా చేయడం వలన భవిష్యత్తులో మండల విద్యా వ్యవస్థ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనుంది. దీనికి కారణం ప్రధానంగా ఒక కిలోమీటర్ పరిధిలో ఉండాల్సిన ప్రాథమిక పాఠశాలలు మూడు కిలోమీటర్లకు ఒక ప్రాధమిక పాఠశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ విధంగా మండలంలోని 28 గ్రామ పంచాయతీ కేంద్రాల్లో మాత్రమే ప్రభుత్వ పాఠశాలలు ఏర్పాటు కానున్నాయి. ఈ విధంగా చేయడం వలన భవిష్యత్తులో విద్యార్థులు మూడు కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల కు వెళ్లాలంటే విద్యార్థులు, విద్యార్థులు తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనవల్సి ఉంటుంది. దీని మూలంగా విద్యార్థులు చదువు సమస్యలో పడుతుంది. అంతేకాకుండా విద్యార్థులకు అందుబాటులో ఉండాల్సిన వివిధ భౌతిక వనరుల తోపాటు, ఉపాధ్యాయ వనరులు కూడా తగ్గిపోనున్నాయి. ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ బడువర్గాల విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలలో చదివే అవకాశం కోల్పోతున్నారు. అంతేకుండా విద్యార్థుల్లో ప్రైవేటు స్కూళ్ల పట్ల ఆసక్తి పెరిగి, ఫీజులు కట్టలేని స్థితిలో బడి మానేయడం జరుగుతుంది. దీని మూలంగా దళిత వర్గాల విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతుంది. ఈ కారణం మూలంగా పంచాయతీ పరిధిలో ఒక ప్రభుత్వ పాఠశాల మాత్రమే ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జోరందుకున్నాయి. ఈ కారణంతో విద్యార్ధులు తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పేద విద్యార్థులకు విద్య మిథ్యగా మారిందని, విద్యార్థులకు చదువు దూరం కానుందని విద్యార్థులు తల్లిదండ్రులు మీడియా ముఖంగా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మండలంలో విద్యాశాఖ అధికారులు, సముదాయ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు చడి చప్పుడు లేకుండా తీసుకున్న ఈ నిర్ణయం పట్ల అనేక ఆందోళన వ్యక్తం అవుతున్నాయి.
ఉప గ్రామాల్లో ఉండే పాఠశాలల మూత :
మండలంలో ప్రస్తుతం తీసుకున్న నిర్ణయం పట్ల భవిష్యత్తులో పాఠశాలలు మూతపడే అవకాశం ఎక్కువగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఇటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యం కమిటీలు, సర్పంచులు మండల విద్యాశాఖ అధికారులకు చెప్పినప్పటికీ ఎవరిని సంప్రదించకుండా అడ్డగోలు నిర్ణయాలతో సముదాయ పాఠశాలలను ఎత్తివేసే పథకంలో నిమగ్నమయ్యారు. ఈ నిర్ణయం కారణంగా భవిష్యత్తులో విద్యార్థులు బడికి పోవాలంటే కేవలం పంచాయతీ కేంద్రంలోని పాఠశాలలో మాత్రమే చదువుకోవలసిన అవసరం ఏర్పడుతుందని, తద్వారా పాఠశాలల్లో విద్యార్థులు బడి మానేసి బడి బయట పిల్లలు మారుతారు అనే వాస్తవం తోపాటు పంచాయతీ కేంద్రంలోని పాఠశాలలు మాత్రమే మనుగడ సాగించనున్నాయనే ఆందోళన కలుగుతోందని విద్యార్థులు తల్లిదండ్రులు వాపోతున్నారు. మండల విద్యాశాఖ ఇకనైనా స్పందించి ఇటువంటి నిర్ణయాలను వాయిదా వేసుకోవాలని కోరారు.
Leave a Reply