భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (ఫిబ్రవరి 09) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో ఆదివారం వరికోతలు మొదలవడంతో వలసలు వచ్చిన బాతుకాపరులు బాతు పిల్లలను మేతకు వేలసంఖ్యలో తీసుకొచ్చారు. ఈ బాతుపిల్లలను వరికోతలు కోసిన పొలాలలో వదులుతారు, అవి రాలిన ఒడ్లు, పురుగులు తిని బతుకుతాయి. ఈ విధంగా కాపరులు రోడ్డు పక్కనే గుడారాలు ఏర్పరచుకొని పిల్లాపాపలతో, చదువు సంధ్యలు లేకుండా జీవిస్తూ బాతులనే అప్లైశ్వర్యంగా భావిస్తున్నారు. వీరి జీవన విధానం బండి చక్రంలా తిరుగుతూ ఏదో ఒక ప్రాంతంలో వలస జీవితాన్ని కొనసాగిస్తుంటారు. వీరి జీవితాలు లాగే పంట కోతలు మొదలైన రైతుల గుండెల్లో అప్పులు తీరే పరిస్థితి లేక పంట దిగుబడి ఉన్నను, గిట్టుబాటు ధరలు లేక ధాన్యాన్ని అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కొంతమంది రైతులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Leave a Reply