భీమ్ న్యూస్ ప్రతినిధి ఉభయ గోదావరి (ఫిబ్రవరి 12) ఏపీ బర్డ్ ఫ్లూ వైరస్.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను వణికిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ అక్కడి ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రజలు చికెన్ వంక చూడాలంటేనే భయపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా కానూరులో కోళ్లకు వైరస్ తోకినట్టుగా అధికారులను నిర్ధారించడంతో ఒక్కసారిగా చికెన్ తినేవాళ్లు లేకుండా పోయారు.
ఏపీలో పడిపోయిన చికెన్ ధరలు :
ఇప్పటివరకు ఉభయ గోదావరి జిల్లాలలో 50 లక్షల పైగా కోళ్లు మృతి చెందినట్లుగా సమాచారం రావడంతో బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన కోళ్లను తింటే జబ్బు పడతాం అన్న భయంతో ప్రజలు చికెన్ షాప్ లో వంక నే చూడడం లేదు. ఇక అధికారులు కూడా వరుసగా బర్డ్ ఫ్లూ వైరస్ నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేయడంతో ఏపీలో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి.
ఏపీ సరిహద్దుల్లో కోళ్ళ వాహనాల తనిఖీ… వాహనాలు వెనుకకు :
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లే కోళ్ల వాహనాలను సరిహద్దులలోనే అడ్డుకుంటున్నారు. ఏపీ నుంచి వచ్చే కోళ్ళ వాహనాలను తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. 24 గంటలు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి కోళ్ల వాహనాలు వెళ్లకుండా చూస్తున్నారు.
30 రూపాయలకే చికెన్.. కోనేవారే కరువు :
ఇక బర్డ్ ఫ్లూ ఎక్కువగా ప్రభావం చూపిస్తున్న జిల్లాలలో కిలో చికెన్ 30 రూపాయలకే అమ్ముతున్నా ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పౌల్ట్రీ ల నిర్వహకులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలోని కానూరులో రెడ్ జోన్ ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. పశు సంవర్ధక శాఖ అధికారులు బర్డ్ ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో పౌల్ట్రీ నిర్వాహకులను అలర్ట్ చేస్తున్నారు మరి…!
Leave a Reply