భీమ్ న్యూస్ ప్రతినిధి ఏలూరు ఉంగుటూరు (ఫిబ్రవరి 12) ఏపీలోని పలు జిల్లాల్లో బర్డ్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. తూర్పు గోదావరి జిల్లా కానూరులో కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకినట్లుగా అధికారులు ఇప్పటికే నిర్ధారించారు. ఇప్పటి వరకు ఉభయ గోదావరి జిల్లాల్లో 50 లక్షలకు పైగా కోళ్లు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బర్డ్ ఫ్లూ భయం, అధికారుల వరుస హెచ్చరికలతో రెండు తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు దారుణంగా పడిపోయాయి. కోళ్లకు బర్డ్ ఫ్లూ వైరస్ సోకిందనే ప్రచారం సోషల్ మీడియా లో ఊపందుకోవడంతో జనం చికెన్ కొనుగోలు చేసేందుకు జంకుతున్నారు.
ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో మనిషికి బర్డ్ ఫ్లూ వైరస్ సోకిన విషయం కలకలం రేపుతోంది. ఉంగుటూరు మండల పరిధిలోని ఓ వ్వక్తికి బర్డ్ ఫ్లూ సోకినట్లుగా నిర్ధారణ అవ్వడంతో జిల్లా వైద్య శాఖ అధికారులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. కోళ్ల ఫారం సమీపం నివాసం ఉంటున్న ఓ వ్యక్తిలో బర్డ్ ఫ్లూ లక్షణాలు కనిపించడంతో అధికారులు అతడి శాంపిల్స్‌ను సేకరించారు. అక్కడ మేడికల్ క్యాంపులను ఏర్పాటు చేసి అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తొలి కేసు నమోదైందని జిల్లా వైద్యశాఖ అధికారి ఈ సందర్భంగా వెల్లడి చేశారు.
Leave a Reply