భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుపతి (ఫిబ్రవరి 14) ఉష్ణోగ్రత తక్కువ వల్ల బర్డ్ ఫ్లూ ప్రబలుతోందని ఉభయగోదావరి జిల్లా ఎక్కువగా ఈ కేసులు నమోదయ్యాయని ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఇన్ ఛార్జి రిజిస్ట్రార్ సీహెచ్ లత తెలిపారు. గురువారం తిరుపతిలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ విదేశాల నుంచి వచ్చే వలస పక్షుల వల్ల ఈ వ్యాధి సోకుతుందని , ఉష్ణోగ్రత పెరిగేకొద్దీ ఈ వ్యాధి లక్షణాలు తగ్గుముఖం పడతాయన్నారు. ఉడికించిన మాంసం, గుడ్లు తినొచ్చని ఆమె తెలిపారు.
Leave a Reply