భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్ళకూరు (ఫిబ్రవరి 14) తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండల కేంద్రము లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో గురువారం పోషణభీ – పడాయిభీ మండలస్థాయిలో అంగన్వాడీ టీచర్ లకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు. నూతన విద్యా విధానం2020 ప్రకారం 3 నుండి 6 సంవత్సరాల విద్యార్థులకు పోషణతో పాటు విద్యనందించే ఉద్దేశంతో కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని రిసోర్స్ పర్సన్లు తెలిపారు. టీచర్లకు మంచి సదుపాయాలతో శిక్షణ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి మునిశేఖర్, ఐసీడీఎస్ సీడీపీఓ కె ఉమామహేశ్వరి, సూపర్వైజర్ సాయి లక్ష్మి, అంగన్వాడి టీచర్లు పాల్గొన్నారు.
Leave a Reply