భీమ్ న్యూస్ ప్రతినిధి సూళ్లూరుపేట (ఫిబ్రవరి 14) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గం భీమ్ భారత్ సైనిక్ అధ్యక్షులు గ్రద్దగుంట నాగూర్, మస్తాన్ ల తండ్రి మునస్వామి (65) అంత్యక్రియలు దుఃఖ సాగరంగా శుక్రవారం జరిగింది. సూళ్లూరుపేట మండలం కోళ్ళమిట్ట, ఎర్రబాలెం గ్రామానికి చెందిన గ్రద్దగుంట నాగూర్, మస్తాన్ ల తండ్రి మునుస్వామి శుక్రవారం తెల్లవారు జామున 2 గంటల సమయంలో మరణించారు. ఈ సమాచారం అందుకున్న సూళ్లూరుపేట నియోజకవర్గం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, టిడిపి అగ్ర నాయకులు, రాజకీయ నాయకులు, అధికారులు, గ్రద్దగుంట మునస్వామి పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రద్దగుంట నాగూర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
Leave a Reply