భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (ఫిబ్రవరి 15) ఏపీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా మూడవ శనివారం స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు పాఠశాల విద్యా శాఖ ప్రకటించడం విడ్డూరంగా ఉందని, స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు హాజరయ్యే ఉపాధ్యాయులు ఉదయం పాఠశాల పూర్తి చేసి మధ్యాహ్నం పిల్లలకు భోజనాలు పెట్టించిన తర్వాత ఒంటి గంట లోపల క్లస్టర్‌కు హాజరు కావాలని చెబుతున్నారు. గత ఇన్నాళ్ళ చరిత్రలో ఈ విధమైన నిర్ణయాలు ఏ అధికారులు తీసుకోలేదని, ఒక్క అర పూట రోజులో కాంప్లెక్స్ నిర్వహణ ఏమిటని ప్రశ్నిస్తున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఏసీ గదుల్లో కూర్చుని చెత్త నిర్ణయాలతో విద్యా వ్యవస్థ పై ప్రతికూల నిర్ణయాలతో ఉపాధ్యాయులను విద్య వ్యవస్థను ప్రగతి పథంలో నడిచేందుకు అడ్డంకులుగా ఏర్పరుస్తున్నారని మరికొందరు విమర్శల నేపథ్యం కొనసాగుతోంది. కొన్ని పాఠశాలలు క్లస్టర్‌కు సుదూర ప్రాంతాలలో ఉన్నాయని అన్నారు. సమయానికి పోవాలనే హడావిడిలో, తొందరలో ఉపాధ్యాయులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. రాష్ట్రంలో చాలా చోట్ల పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాలు తక్కువగా ఉన్నాయని దీంతో మహిళా ఉపాధ్యాయులు, అధిక వయసుగల ఉపాధ్యాయులు ఆటోలపై ఆధారపడాల్సి ఉంటుందన్నారు. నిర్ణీత సమయానికి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు చేరుకోవడం కష్టం అవుతుందని, కొన్ని పాఠశాలలసముదాయాలు 20 కిలోమీటర్ల దూరంలో కూడా ఉన్నాయన్నారు. కనీసం ఉపాధ్యాయులు భోజనం చేసే దానికి కూడా సమయం సరిపోదు. కావున ప్రభుత్వం పునరాలోచన చేసి పూర్తి రోజు నిర్వహించేందుకు, పాఠశాలకు సెలవు ప్రకటించి కాంప్లెక్స్ సమావేశాలు జరపాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. స్కూల్ కాంప్లెక్స్ రోజున అవసరం వున్న ఉపాధ్యాయులకు సాధారణ సెలవులు వినియోగించుకోవడానికి అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏది ఏమైనా కాంప్లెక్స్ మీటింగులు ఆరపూట జరగడం విద్యా వ్యవస్థకు మాయని మచ్చగా మిగులుతోందని, ఉన్నతాధికారుల నిర్ణయాలు విద్యా వ్యవస్థ పై ప్రతికూల ప్రభావాలు చూపుతాయని విమర్శిస్తున్నారు.
Leave a Reply