భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (ఫిబ్రవరి 18) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలోని లేబూరు బిట్ -1 గ్రామంలో మండల వ్యవసాయశాఖ అధికారులు పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవసాయ సహాయ సంచాలకులు ఏ.రాజ్ కుమార్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వారు నిర్వహించే రైతు నమోదు లో అందరూ తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇలా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల వ్యవసాయ శాఖ సబ్సిడీలు అందుతాయని తెలిపారు. మండలంలోని వ్యవసాయ శాఖ సిబ్బంది చేత రైతు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రైతులకు వీరు తెలియజేశారు.
అనంతరం మండల వ్యవసాయాధికారి డి. రఘునాథరెడ్డి మాట్లాడుతూ, సొంత భూమి కలిగినటువంటి రైతులు ప్రస్తుతం దీనికి అర్హులు. ఇలా రిజిస్ట్రేషన్ అయిన రైతులకు 11 అంకెలతో ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ తో భవిష్యత్తులో ఒక రైతు ఐడెంటి కార్డు కూడా వస్తుందని తెలిపారు. ఫార్మర్ రిజిస్ట్రేషన్ లో నమోదైన రైతులకు మాత్రమే అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, వ్యవసాయ యాంత్రీకరణ పనిముట్లు, పంట భీమా, పంట నష్టపరిహారం, సబ్సిడీ విత్తనాలు వంటి పథకాలు అందుతాయి అని తెలియజేశారు. మండలంలోని ప్రతి రైతు వారి గ్రామాల్లోని వ్యవసాయ సిబ్బంది చేత ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ రైతులు, వి.ఏ.ఏ. సుమ పాల్గొన్నారు.
Leave a Reply