మీడియాతో మాట్లాడుతున్న పంచాయతీ కార్యదర్శి శైలజ
భీమ్ న్యూస్ ప్రతినిధి ఇందుకూరుపేట (ఫిబ్రవరి 22) నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం డేవిస్ పేట గ్రామ పంచాయతీ వైఎస్సార్సీపీ నాయకులు మేనాటి ప్రసాద్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు తన్నీరు మధుబాబు, పంచాయతీ కార్యదర్శి శైలజ ఆధ్వర్యంలో నేడు పంచాయతీ పరిధిలోని పాగావారిపాలెం గ్రామం నందు ఇంటింటికీ తిరిగి చెత్త వేయుటకు డబ్బాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్యదర్శి శైలజ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు చెత్త నుండి సంపద తయారీ కేంద్రం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు, రేపు ఇంటింటి నుండి చెత్త సేకరణ చేస్తారని, దాని కోసం చెత్త డబ్బాలను ఇంటింటికీ తిరిగి పంపిణీ చేశామని తెలిపారు. తడి చెత్తను పచ్చ రంగు డబ్బా లోనూ, పొడి చెత్తను బులుగు రంగు డబ్బా లోనూ వేరు వేరుగా వేయాలని గ్రామ ప్రజలకు సూచనలు చేశారు. ఆ డబ్బాల్లో వేసిన చెత్తను పంచాయతీ కార్మిక సిబ్బంది సేకరిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక వార్డు మెంబర్ల ప్రతినిధులు మనుబోలు మల్లిఖార్జున, గోళ్ళ శ్రీనివాసులు, ఆశా కార్యకర్త మనుబోలు వరలక్ష్మి, కదురు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
డబ్బాలు పంపిణీ చేస్తున్న ప్రజా ప్రతినిధులు
Leave a Reply