భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు రూరల్ (ఫిబ్రవరి 23) అవినీతికి పరాకాష్ట, ప్రభుత్వ భూమిని పట్టా భూమిగా మార్పు చేయడం. ప్రభుత్వ భూమిని కాజేయాలని పథకం ప్రకారం భూమిని కబ్జా చేసి తొలుత సాగు చేసుకుని వ్యవసాయం చేశారు. కొంత కాలం తరువాత ఆ భూమిలో బూడిద మట్టిని నింపి భూమి స్వరూపాన్ని మార్చారు. కొందరు అవినీతి అధికారులను ప్రలోభాలకు గురి చేసి, ఆ అధికారుల సహకారంతో పట్టా భూమి అమ్మకాలు, కొనుగోలు జరిపినట్లుగా ఆ ప్రభుత్వ భూమిని పట్టా భూమి అని నకిలీ పత్రాలు సృష్టించి ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. మరి కొంత కాలం తరువాత కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమికి ప్రక్కనే వున్న రోడ్డు పోరంబోకు ప్రభుత్వ భూమిని సైతం కబ్జా చేసి రెండింటినీ ఒక్కటిగా కలిపారు, స్వంతం చేసుకున్నారు. చాప కింద నీరులా వ్యవహారమంతా నడిపించారు. సంవత్సరాలు గడిచి పోయాయి, అధికారులు మారారు, ప్రభుత్వాలు మారాయి.
పూర్తి వివరాల్లోకి వెళితే, నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరు గ్రామ పంచాయతీ, కాకుపల్లి -2 రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 381/2 లో వున్న కృష్ణాపట్నం నీటి పారుదల కాలువ ప్రక్కన కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమిని సర్వేపల్లి నియోజకవర్గం ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామానికి చెందిన తొండమనాటి శ్రీధర్ అనే వ్యక్తి రైటర్ కబ్జా చేశాడు. సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే ముఖ్య అనుచరుడిని అని అధికారులకు చెబుతూ, ప్రభుత్వ ఆస్తులను కాజేసి ఎమ్మెల్యే పేరును చెడ గొడుతున్న ఘనత శ్రీధర్ కే దక్కుతుంది. ప్రస్తుతం ఆ ప్రభుత్వ భూమి పట్టా భూమిగా చలామణి చేస్తూ ఆ భూమిని అంకణాలుగా విభజించి వ్యాపార సముదాయాలకు లీజుకు ఇవ్వడం, స్థలం లీజుకు తీసుకున్న వ్యక్తి టీ కేఫ్ కోసం రూములు నిర్మాణం చేయడం విశేషం. గ్రామ పరిపాలనా అధికారులకు ఆ భూమి పట్టా భూమి అని, దాన్ని కొనుగోలు చేసినట్లు సృష్టించిన నకిలీ పత్రాలు చూపించగా, ఇందులో వాస్తవం వుందా.. లేదా.. అని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనం వహించడం గమనార్హం. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు మీడియా ముఖంగా కోరుతున్నారు.
ఆక్రమించుకున్న ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణాలు
Leave a Reply