భీమ్ న్యూస్ ప్రతినిధి నెల్లూరు రూరల్ (ఫిబ్రవరి 25) నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం మాదరాజు గూడూరు గ్రామ పంచాయతీ కాకుపల్లి – 2 రెవిన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 381/2 లో కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమిని ముత్తుకూరు మండలం కృష్ణాపట్నం గ్రామ నివాసి తొండమనాటి శ్రీధర్ అనే వ్యక్తి కబ్జా చేసి అమ్మకాలు జరిపిన విషయం తెలిసిందే. ఇక్కడ ప్రస్తుతం పట్టా భూమి ఎకరా ధర రెండు కోట్ల రూపాయలు వున్నది. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని 90 లక్షల రూపాయలు ధర పెట్టి అమ్మకాలు జరిపినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గ్రామ పంచాయతీ అధికారులు ఇచ్చిన రిపోర్టు లు ఆధారం చేసుకుని భూమి రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుందని స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు శాఖా అధికారులు స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ భూమి రిజిస్ట్రేషన్ కి గ్రామ సర్వేయర్ ఇచ్చిన భూమి సర్వే రిపోర్ట్ ఆధారం గానా లేక గ్రామ రెవిన్యూ అధికారి ఇచ్చిన భూమి శిస్తు ఆధారం గానా లేక మరేదైనా రిపోర్టు ఆధారం గానా అనేది తేలాల్సి వుంది. కబ్జా చేసిన ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాలు కడుతూ ప్రముఖ రాజకీయ నాయకుడు పేరు చెప్పి ఆ భూమి జోలికి వస్తే, మీకు ఇబ్బందులు తప్పవని మీడియా ప్రతినిధులను బెదిరిస్తున్నారంటే అక్కడ అవినీతి భారీగా జరిగిందని అర్థమవుతోంది. కాలువ పోరంబోకు ప్రభుత్వ భూమిని, పట్టా భూమిగా నకిలీ పత్రాలు సృష్టించి రిజిస్ట్రేషన్ చేయించి అమ్మకాలు జరిపి సొమ్ము చేసుకున్న విషయంలో అధికారుల సహకారం ఎంతుందో మరి. ఎన్ని వాటాలో.. ఎవరి వాటా ఎంతో… లోగుట్టు పెరుమాళ్ కెరుక.
కబ్జా చేసిన ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు
Leave a Reply