భీమ్ న్యూస్ ప్రతినిధి తిరుమల (ఫిబ్రవరి 26) తిరుమల తిరుపతి దేవస్థానం ప్రాణదాన ట్రస్టుకు బుధవారం రూ. 81 లక్షలు విరాళంగా అందించారు. చెన్నైకు చెందిన యాక్సెస్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ టీటీడీ ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు రూ. 70 లక్షలు విరాళంగా ఇచ్చింది. వర ఫ్యూచర్ ఎల్ఎల్పీ అనే సంస్థ రూ. 11 లక్షలు విరాళంగా అందించింది. ఆ మేరకు దాతలు చెక్కులను టీటీడీ అడిషనల్ ఈవో సి. హెచ్. వెంకయ్య చౌదరికి తిరుమలలోని వారి క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా దాతలకు పట్టు వస్త్రాలు, స్వామి వారి ప్రసాదాలు అందజేశారు.
Leave a Reply