భీమ్ న్యూస్ ప్రతినిధి శ్రీకాళహస్తి (ఫిబ్రవరి 26) తిరుపతి జిల్లాలో దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీకాళహస్తి స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల్లో మహాశివరాత్రి రోజున శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర వారు ఇంద్రవిమానం, చప్పర వాహనంపై కొలువు తీర్చి గ్రామోత్సవం బుధవారం కన్నుల పండుగ జరిగింది. భక్తుల స్వామి అమ్మవారిని దర్శించుకుని కర్పూర హారతులు నీరాజనాలు పట్టారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నందున ప్రభుత్వం తరపున దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. వీరికి ఆలయ ఈవో బాపిరెడ్డి, ఆలయ అర్చకులు 4వ గోపురం వద్ద పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.శ్రీకాళహస్తిలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్న వేళ స్వామి అమ్మవారి దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కాకుండా వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వస్తున్నారు. చిన్నపిల్లలు తప్పిపోకుండా వారికి ట్యాగ్లను ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి. దీనివల్ల తప్పిపోయిన పిల్లలను తొందరగా గుర్తించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా మహాశివరాత్రి పర్వదినానికి భక్తులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.ఎస్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply