భీమ్ న్యూస్ ప్రతినిధి సంతబొమ్మాలి (ఫిబ్రవరి 28) శ్రీకాకుళం జిల్లా, సంత బొమ్మాలి మండలం దండు గోపాలపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు జాతీయ విజ్ఞాన దినం వేడుకలు సైన్స్ ఉపాధ్యాయులు వీరభద్రరావు, ఆదికేశవరెడ్డి, జి. లక్ష్మీల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత పాఠశాలలోని జాతీయ నాయకుల విగ్రహాలకు, సి.వి.రామన్ చిత్రపటానికి పుష్ప మాలాలంకృతులను ప్రధానోపాద్యాయులు శ్రీకోత చైతన్య చేశారు. అనంతరం అన్ని తరగతుల విద్యార్థులు చేసిన ప్రాజెక్టుల ప్రదర్శనను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులలో బిందు సేద్యం, స్మోక్ ఎలర్ట్, హైడ్రాలిక్ క్రేన్, వర్షపునీరు సంరక్షణ, పవన విద్యుత్, జల చక్రము, చంద్రయాన్ -3, అగ్ని పర్వతం నమూనా, పౌష్ఠిక ఆహారం, విండ్ మిల్, సైన్సు రంగ వల్లికలు వంటి 26 సైన్సు వర్కింగ్ మోడల్స్ ప్రదర్శించారు. విద్యార్థులు వాటిని ఆసక్తితో తిలకించారు. ఈ ప్రదర్శన ఉదయం 9-30 నుండి 2-00 గంటల వరకు కొనసాగింది. సైన్స్ డే ను రామన్ కనిపెట్టిన రామన్ ఎఫెక్టు ను అతను ఫిబ్రవరి 28న కనిపెట్టారని దానికి గుర్తుగా ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు.
ఈ సమావేశంలో పాఠశాల ప్రధానోపాద్యాయులు శ్రీకోత చైతన్య విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ పాఠశాలలో ఇటువంటి ప్రదర్శనలు నిర్వహించడం వలన విద్యార్థులలో ఆలోచనశక్తి, తార్కిక భావనలు అలవడి, పరిశీలనాశక్తి, ప్రశ్నించే తత్వము అలవడుతుందని, ప్రాజెక్టుల తయారీలో ఒకరికి ఒకరు సహకరించుకొని పనిలో పూర్తిగా నిమగ్నమవుతారని తెలిపారు. అందరు విద్యార్థులు ప్రాజెక్టులు తయారుచేయటంలో అసక్తి కనబరచాలని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్విజ్, వ్యాస రచనలలోనూ మరియు మంచి ప్రదర్శన కనబరిచిన ప్రోజెక్టులు వారికి ఉత్తమ ప్రాజెక్టులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాస్కరరావు, లక్ష్మీకాంతం, తిరుపతిరావు, నాగేశ్వరరావు, పార్వతి, ఉమ, రాము, చిన్నారావు, మురళీధరరాజు, విజయలక్ష్మి, రవికుమార్, శ్రీనివాసరావు, దయాసాగర్, మార్కండేయులు తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply