భీమ్ న్యూస్ ప్రతినిధి పెళ్లకూరు (మార్చి 01) తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల నెలుబల్లి లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి.కవిత సభా అధ్యక్షతన శుక్రవారం జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అద్భుతమైన ప్రయోగాలు ప్రదర్శించారు. పర్యావరణ కాపాడడానికి ప్లాస్టిక్ భూతం నివారణ, ప్రజలు అడవులను సంరక్షించాలనే విధంగా అడవుల నిర్మూలన అరికట్టడం, చెట్లను పెంచి జీవ వాతావరణంలో వర్షాలు సమృద్ధి ఉండడంతో మానవాళికి ఆక్సిజన్ తో పాటు త్రాగునీరు ఉంటేనే మానవ మనుగడ సాగుతుందని విద్యార్థులు తెలియజేశారు.
విద్యార్థులు ఇటువంటి అనేక రకాల సైన్స్ ప్రయోగాలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులను ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అభినందించారు. పంట పొలాలలో రాత్రిపూట క్రిమి కీటకాలను ఆకర్షించి పంటలను రక్షించేటట్లుగా మరియు రాత్రిపూట రైతులు పొలాలలో తిరుగుతున్నప్పుడు క్రిమి కీటకాల భారీ నుండి రక్షణ కల్పించే విధంగా సౌర శక్తి సహాయంతో పనిచేసే వివిధ ప్రయోగాలు చేసి విద్యార్థులు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సైన్స్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, ఆదిలక్ష్మి విద్యార్థులతో సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్ సరళ ఉపాధ్యాయునిలు ధనలక్ష్మి , మణి, ఉపాధ్యాయులు డివి రమణ, శ్రీరాములు సురేష్ , ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు ఖాదర్ భాషా మధ్యాహ్న భోజన నిర్వాహకులు, ఆయా, వాచ్మెన్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారని తెలిపారు.
Leave a Reply