భీమ్ న్యూస్ ప్రతినిధి అమరావతి (మార్చి 03) ఆంధ్రప్రదేశ్ (ఏపీ) మరియు తెలంగాణ రాష్ట్రాల్లో MLA కోటా కింద 10 ఎమ్మెల్సీ (ఎమ్మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్) స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈ రోజు (సోమవారం) విడుదల కానుంది. ఈ స్థానాల్లో ఏపీలో 5, తెలంగాణలో 5 ఖాళీలు ఉన్నాయి.
ఎన్నికల షెడ్యూల్ :
- నామినేషన్లు దాఖలు : మార్చి 10వ తేదీ వరకు
- నామినేషన్ల పరిశీలన : మార్చి 11న
- నామినేషన్ ఉపసంహరణ గడువు : మార్చి 13న
- పోలింగ్ తేదీ : మార్చి 20న
- ఓట్ల లెక్కింపు : మార్చి 20వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి
ఏపీ నుంచి అభ్యర్థులు :
ఏపీలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు ప్రధాన పార్టీల నుంచి పోటీదారుల పేర్లు చర్చల్లో ఉన్నాయి.
- టీడీపీ నుంచి : వంగవీటి రాధా, జవహర్, ఎస్వీఎస్ఎన్ వర్మ
- జనసేన నుంచి : నాగబాబు
- బీజేపీ నుంచి : మాధవ్
ఇది అధికార పక్షం మరియు విపక్షాలకు రాజకీయంగా కీలకమైన ఎన్నిక కానుంది. 20న అసెంబ్లీలో జరిగే ఈ ఎన్నికల ఫలితాలు ఏపీలోని రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయట.
Leave a Reply