భీమ్ న్యూస్ ప్రతినిధి టెక్కలి (మార్చి 05) శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం టెక్కలి ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్ లో ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుల అభినందన సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టెక్కలి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ (అర్బన్) అంబటి విజయకుమార్, టెక్కలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.వి. వివేకానంద, స్సామ్మా జర్నలిస్టుల రాష్ట్ర అధ్యక్షులు, ఐ.జె.యు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు లు విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులను బెండి నర్సింగరావు, గడిమెట్ల శ్రీనివాసరావు, కొంచాడ రవిశంకర్, ఎం.వి. మల్లేశ్వరరావు ఘనంగా సన్మానం చేశారు.
ఈ సందర్భంగా ఐజేయు కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ జర్నలిస్టులకు వృత్తి ఓరిని తెస్తాయని అన్నారు. మీడియా స్వేచ్ఛ అంటే యజమాన్యం స్వేచ్ఛ కాదని రాజ్యాంగం పరిధిలో భావ ప్రకటన స్వేచ్ఛ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాజ్యాంగానికి, చట్టాలకి ఎవరు అతీతులు కారని , ప్రజాస్వామ్య పరిరక్షణలో మీడియా నిర్వహించే పాత్రను వ్యవస్థలో ఉన్న సంస్థలన్నీ గౌరవించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బారు ముఖ్య అతిథి దివ్వల వివేకానంద మాట్లాడుతూ మీడియా అంటే తనకు ఎంతో గౌరవం ఉందని టెక్కలి ప్రెస్ క్లబ్ పరిధిలో ఎటువంటి సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
అనంతరం టెక్కలి సీఐ విజయకుమార్ మాట్లాడుతూ శాంతిభద్రత పరిరక్షణలో పోలీసులు మీడియా మధ్య సమన్వయం అవసరమని అన్నారు. చాలా కేసుల్లో పరిశోధనతో కూడిన వాస్తవాలు వెలికి తీసి తమకు సహకారాలు అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బెండి నర్సింగరావు, అధ్యక్షత ఊహించగా ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు జగదీష్, రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు కార్యదర్శులు, బాలు, వాసు, ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా టెక్కలి ప్రెస్ క్లబ్ సభ్యులు శేఖర్, రమేష్, కృష్ణ, శ్రీధర్, రాంజీ, బాలకృష్ణ, తేజ, శ్రీనివాస్, పాపారావు, శ్రీనివాస్, బాలు, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Leave a Reply